జీ20 అధ్యక్ష పదవికి భారత్ సరైన దేశం: బ్రిటన్ ప్రధాని రిషి సునక్

బ్రిటన్ ప్రధాని రిషి సునక్ భారతదేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జి 20 సమావేశాల్లో భాగంగా భారత్ రానున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశం యొక్క వైవిధ్యం దాని అసాధారణ విజయాలే జీ 20 అధ్యక్ష పదవిని నిర్వహించడానికి “సరైన సమయంలో” ఇది “సరైన దేశం” అని రిషి సునక్ బుధవారం అన్నారు.

Update: 2023-09-07 06:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ భారతదేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జీ20 సమావేశాల్లో భాగంగా భారత్ రానున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశం యొక్క వైవిధ్యం దాని అసాధారణ విజయాలే జీ 20 అధ్యక్ష పదవిని నిర్వహించడానికి “సరైన సమయంలో” ఇది “సరైన దేశం” అని రిషి సునక్ బుధవారం అన్నారు. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. గత సంవత్సరం, ప్రపంచం అసంఖ్యాక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు కూటమికి భారత్‌కు అధ్యక్ష పదవి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే UK, భారతదేశం మధ్య సంబంధాలు రెండు దేశాల భవిష్యత్తును కూడా నిర్వచించగలవని అన్నారు. ఇది వర్తమానాన్ని నిర్వచించడం కంటే ఎక్కువే అని.. భారతదేశం అటువంటి ప్రపంచ నాయకత్వాన్ని చూపడం చాలా అద్భుతంగా ఉందని బ్రిటన్ యొక్క మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రి సునక్ అన్నారు.

Tags:    

Similar News