లోక్‌సభ ఎన్నికలలో 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులుగా ప్రకటించారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది

Update: 2024-05-24 03:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులుగా ప్రకటించారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. తాజా విడుదల చేసిన ఏడీఆర్ నివేదిక ప్రకారం, 359 మంది 5వ తరగతి వరకు చదువుకున్నారు. 647 మంది 8వ తరగతి వరకు, 1,303 మంది 12వ తరగతి, 1,502 మంది గ్రాడ్యుయేట్ పూర్తి చేసినట్టు తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. డాక్టరేట్ కలిగి ఉన్న అభ్యర్థులు 198 మంది ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది విద్యార్హతలను ఏడీఆర్ విశ్లేషించింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు దశల ఓటింగ్ పూర్తవగా, ఈ నెల 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Similar News