బీజేపీ కంచుకోట.. 3 దశాబ్దాలుగా ఎదురే లేదు..!

ప్రధాని, అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ లో గాంధీనగర్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా మారింది. దాదాపు 3 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో బీజేపీకి ఎదురేలేదు.

Update: 2024-05-07 05:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని, అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ లో గాంధీనగర్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా మారింది. దాదాపు 3 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో బీజేపీకి ఎదురేలేదు. 34 ఏళ్లుగా అక్కడ్నుంచి బీజేపీ నేతలే గెలుపొందుతున్నారు. వాజ్ పేయి, అద్వాణీ వంటి అగ్రనేతలు గాంధీనగర్ నుంచే గెలుపొందారు. 1989 నుంచి ఈ స్థానంలో బీజేపీయే గెలుపొందుతుంది. కాంగ్రెస్ నుంచి మహామహులు బరిలో దిగినా నిరాశ తప్పలేదు. గతంలో టీఎన్ శేషన్, రాజేష్ ఖన్నాలు పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఈ సారి కూడా గాంధీనగర్ నుంచి కేంద్రహోంమంత్రి అమిత్ షా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేస్తున్నారు. అమిత్ షాకు పోటీగా కాంగ్రెస్ తరఫున.. గుజరాత్ మహిళా విభాగం అధ్యక్షఉరాలు సోనల్ పటేల్ బరిలో దిగారు.

గత ఎన్నికల్లో ఐదున్నర లక్షల తేడాతో అమిత్ షా గెలిచారు. ఈ సారి మెజార్టీ భారీగా పెరుగుతుందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. కాగా.. గాంధీ నగర్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి గాంధీనగర్ నార్త్, కలోల్, సనంద్, ఘట్లోడియా, వేజల్పూర్, నారన్ పురా, సబర్మతి. ఈ మొత్తం స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది.

1999 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన టీఎన్ శేషన్ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. అతని ప్రత్యర్థిగా అద్వాణీ పోటీలో ఉన్నారు. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలిగాడే తప్ప.. శేషన్ విజయం సాధించలేకపోయారు. అప్పటి నుంచి ఆ సీటు బీజేపీకి కాయంగా కన్పిసంది. 1996 లో వాజ్ పేయి ఈ స్థానంతో పాటు లక్నో నుంచి కూడా బరిలోకి దిగారు. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో గాంధీనగర్ లో రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయ్ పటేల్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఖన్నా ఓటమి పాలయ్యారు. మరోవైపు, ఈ సారి మాత్రం అమిత్ షా దాదాపు 10 లక్షల ఓట్ల మెజార్టీ సాధిస్తారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.

Similar News