బీజేపీ గెలిస్తే తదుపరి ప్రధాని ఆయనే..కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాను ప్రధాన మంత్రి చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధమైందని తెలిపారు. 2025లో నరేంద్ర మోడీకి 75 ఏళ్లు వచ్చిన తర్వాత అమిత్ షా ప్రధాని అవుతారని, ఆయనను పీఎం చేసేందుకే

Update: 2024-05-16 06:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాను ప్రధాన మంత్రి చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధమైందని తెలిపారు. 2025లో నరేంద్ర మోడీకి 75 ఏళ్లు వచ్చిన తర్వాత అమిత్ షా ప్రధాని అవుతారని, ఆయనను పీఎం చేసేందుకే..శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్, వసుంధర రాజే, మనోహర్ లాల్ ఖట్టర్, దేవేంద్ర ఫడ్నవీస్ ఇలా ప్రముఖులందరినీ పక్కన బెట్టారని ఆరోపించారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్‌తో కలిసి గురువారం లక్నోలో సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ ప్రసంగించారు.

‘పీఎం మోడీ వయస్సు, పదవీ విరమణ సమస్యను లేవనెత్తినప్పుడు, అమిత్ షాతో సహా ఇతర నాయకులు దానిని వ్యతిరేకించారు. కానీ 75 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేయనని మోడీ ఎప్పుడూ చెప్పలేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయం దేశం మొత్తానికి తెలుసని చెప్పారు. రెండు మూడు నెలల్లో యూపీ సీఎం యోగీ కూడా పదని నుంచి దిగిపోతారని జోస్యం చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచిన తర్వాత రిజర్వేషన్లను ఎత్తే సేందుకు బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు రెడీ చేసిందని ఆరోపించారు.

అయితే ఇటీవల ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతిమలివాల్ పై దాడి గురించి అడినప్పుడు దానికి సమాధానం చెప్పడానికి కేజ్రీవాల్ నిరాకరించారు. దీనిపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ స్వాతి మలివాల్ కంటే దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పారు. కాగా, 75 ఏళ్లు పైబడిన వారెవరూ బీజేపీ పార్టీ పాలనలో కొనసాగరని, బీజేపీకి ఓటేయడం అంటే అమిత్ షాను ప్రధాని చేయడానికి ఓటేయడమేనని కేజ్రీవాల్ గతంలోనూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన అమిత్ షా కేజ్రీవాల్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 

Tags:    

Similar News