ఐసీఎస్ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదల

2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన.. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (CISCE) ICSE 10వ తరగతి, ISC 12వ తరగతి ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి.

Update: 2024-05-06 07:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన.. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (CISCE) ICSE 10వ తరగతి, ISC 12వ తరగతి ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ రోజు విడుదలైన పలితాల్లో ICSE ఉత్తీర్ణత శాతం 99.47%, ISC ఉత్తీర్ణత శాతం 98.19% గా నమోదైంది. కాగా గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది. 2023లో, ICSE 10వ తరగతి పరీక్షలకు హాజరైన మొత్తం 98.94% మంది విద్యార్థులు దాన్ని క్లియర్ చేశారు, 96.93% మంది 12వ తరగతి పరీక్షలను క్లియర్ చేశారు. కౌన్సిల్ ఫిబ్రవరి 12, ఏప్రిల్ 3 మధ్య ISC బోర్డు పరీక్షలను నిర్వహించింది. మరోవైపు, ICSE 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 28 వరకు నిర్వహించబడ్డాయి. విద్యార్థులు CISCE ఫలితాలను ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లు, cisceలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

Similar News