పత్రికా స్వేచ్ఛలో ఎందుకు వెనుకబడిందో తెలిసింది!.. జర్నలిస్ట్ పై దాడికి స్పందించిన రాహుల్ గాంధీ

పత్రికా స్వేచ్ఛ విషయంలో భారతదేశం 159వ స్థానంలో ఎందుకు నిలిచిందో ఈ ఘటన వివరించింది అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-12 15:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పత్రికా స్వేచ్ఛ విషయంలో భారతదేశం 159వ స్థానంలో ఎందుకు నిలిచిందో ఈ ఘటన వివరించింది అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా సభలో జర్నలిస్ట్ పై జరిగిన దాడిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీజేపీ, మోడీ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. నేడు దేశంలో రెండు రకాల మీడియాలు ఉన్నాయని, అబద్దాలు, ద్వేషం వ్యాప్తి చేసేందుకు ప్రధానమంత్రి వెనక ఉండి నడిపించే మీడియా ఒకటైతే.. తమ ప్రాణాలను పణంగా పెట్టి నిజం యొక్క స్వరాన్ని వినిపించి మూల్యం చెల్లించుకుంటున్న వారు మరొక మీడియా అని అన్నారు.

నరేంద్ర మోడీ పాలనలో పత్రికా స్వేచ్ఛ విషయంలో భారతదేశం 159వ స్థానంలో ఎందుకు నిలిచిందో ఆ దేశ హోంమంత్రి సమావేశంలో కేవలం తన పని తాను చేసుకుపోతున్న మిలిటెంట్ జర్నలిస్టుపై పోలీసు రక్షణలో ఇటువంటి గూండాయిజం వివరించిందని తెలిపారు. ఈ వీర యువకుడికి మేమంతా అండగా ఉంటామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాగా రాయ్‌బరేలీలో అమిత్ షా సభ జరుగుతున్న సమయంలో మొలిటిక్స్ ఇండియా అనే మీడియాకు చెందిన రాఘవ్ త్రివేది అనే జర్నలిస్టు పై కొందరు బీజేపీ మూకలు దాడి చేశారు. అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో ర్యాలీకి హాజరయ్యేందుకు డబ్బులు ఇచ్చారా అని కొందరు మహిళలతో మాట్లాడుతున్నారని ఆరోపణలతో జర్నలిస్టును కొట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Similar News