భయానక ఘటన: కారు రెండు సార్లు వృద్దుడి పైకి ఎక్కించిన డ్రైవర్! (వీడియో వైరల్)

కారు వెనక్కి తీయబోయి రెండు సార్లు ఓ వృద్దుడి పైకి ఎక్కించిన అమానుష ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

Update: 2024-05-24 15:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కారు వెనక్కి తీయబోయి రెండు సార్లు ఓ వృద్దుడి పైకి ఎక్కించిన అమానుష ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఘటన ప్రకారం ఝాన్సీ సమీపంలోని ఓ వీదిలో ఇరుకు గల్లీలో రెండు కార్లు పార్క్ చేయబడి ఉన్నాయి. వీటి ముందు నిలిపి ఉంచబడిన ఓ ఎస్‌యూవీ వాహానాన్ని బయటకి తీయడానికి ఓ కారు డ్రైవర్ ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో రాజేందర్ గుప్తా అనే 70 ఏళ్ల వృద్దుడు అటుగా వెళుతున్నాడు. వృద్దుడిని గమణించని కారు డ్రైవర్ వెనక్కి పోనిచ్చి అతన్ని ఢీ కొట్టాడు. వృద్దుడు పడిపోయింది చూడకుండా అతని పైనుండి వాహనాన్ని నడిపించాడు.

ఆ వృద్దుడి ఆర్తనాధాలు వినిపించుకోని డ్రైవర్ మరో సారి ముందుకు వచ్చి అతని మీదికి ఎక్కించాడు. ఇంతలో అటుగా వెళుతున్న జనం వృద్దుడి అరుపులు వినిపించి పరిగెత్తుకుంటూ వచ్చారు. దీంతో కారు దిగిన డ్రైవర్ కారు వృద్దుడిపై ఉందని గుర్తించి వెంటనే వెనక్కి తీశాడు. ఈ ఘటనలో గాయపడిన వృద్దుడ్ని స్థానికులు అదే వాహానంలో ఆసుపత్రికి తరలించారు. ఈ భయానక దృష్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వృద్దుడి కుమారుడి ఫిర్యాదుతో కారు డ్రైవర్ పై పలు నేరాల కింద సిప్రి బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News