దేశంలో హెచ్3ఎన్2తో మహిళ మృతి

గుజరాత్‌లో ఇన్‌ఫ్లుయెంజా హెచ్‌3ఎన్2 వైరస్ సోకి ఓ మహిళ మరణించింది. వడోదరా ఎస్‌ఎస్‌జీ... Gujarat reports first death from H3N2 influenza virus, 7th in India

Update: 2023-03-14 10:18 GMT

గాంధీనగర్: గుజరాత్‌లో ఇన్‌ఫ్లుయెంజా హెచ్‌3ఎన్2 వైరస్ సోకి ఓ మహిళ మరణించింది. వడోదరా ఎస్‌ఎస్‌జీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న 58 మహిళ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో ఈ వైరస్‌తో మరణించినవారి సంఖ్య ఏడుకు చేరింది. మొదటి మరణం కర్ణాటకలో హసన్ జిల్లాలో సంభవించిన సంగతి తెలిసిందే. జనవరి నుంచి మార్చి వరకు రెండు నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ కేసులు 451 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కేసులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు, ఈ నెలాఖరులోగా వైరస్ వ్యాప్తి తగ్గుతుందని అంచనా వేసింది. అయితే హెచ్3ఎన్2తో పాటు ఇన్‌ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్లు సీజనల్ అని, ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News