రాహుల్ గాంధీ అమ్మమ్మ తిరిగొచ్చిన సీఏఏను రద్దు చేయలేదు: అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీ కుటుంబం పై మరోసారి రెచ్చిపోయారు.

Update: 2024-05-09 04:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీ కుటుంబం పై మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీకి పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలనే ఆలోచనలో ఉందని.. కానీ.. రాహుల్ గాంధీ అమ్మమ్మ తిరిగి భూమిపైకి వచ్చిన CAA చట్టాన్ని రద్దు చేయలేరని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి ప్రతిపక్ష నేతలు సీఏఏకు వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. లఖింపూర్ ఖేరీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా అన్నారు.

"ప్రధాని మోడీ నాయకత్వంలో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి (మైనారిటీలకు) భారతదేశం పౌరసత్వం ఇస్తుంది" అని ఆయన చెప్పారు. కాగా మార్చిలో, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిఎఎను అమలు చేసింది. ఇది డిసెంబర్ 31కి ముందు భారతదేశంలోకి ప్రవేశించిన - పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముస్లిం యేతర వలసదారులకు - భారత పౌరసత్వాన్ని పొందడాన్ని సులభతరం చేస్తుంది. 2019 డిసెంబర్‌లో పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించిన నాలుగేళ్ల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

Similar News