Qatar మరణశిక్ష బాధిత అధికారుల కుటుంబసభ్యులతో సమావేశమైన విదేశాంగ మంత్రి జైశంకర్!

ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశమయ్యారు.

Update: 2023-10-30 07:33 GMT

న్యూఢిల్లీ: ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశమయ్యారు. అధికారులను విడిపేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని సోమవారం ఓ ప్రకటనలో జైశంకర్ అన్నారు. ఎనిమిది మంది అధికారుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఖతార్‌లో ఉరిశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలను కలవడం జరిగింది. ఈ కేసుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకోగలం. కేసు వివరాలను ఎప్పటికప్పుడు అధికారుల కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం. వారందరినీ విడిపించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని జైశంకర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ గూఢచర్యం ఆరోపణలపై ఖతార్‌లోని ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బందికి గత వారం ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అల్ దహ్రాలో పనిచేస్తున్న వారిని గతేడాది ఆగష్టులో అరెస్టు చేసింది, అయితే వారిపై అభియోగాలను అధికారికంగా వెల్లడించలేదు.  

Tags:    

Similar News