ఇద్దరు పిల్లలున్న కుటుంబానికి భారీ గుడ్‌న్యూస్.. ఈ పథకం కింద 6 లక్షల రూపాయలు!

ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు తపాలా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది.

Update: 2024-05-17 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు తపాలా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇద్దరు పిల్లల పేరుతో ఓ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం పేరు ‘బాల్ జీవన్ భీమా యోజన’. ఈ పథకంలో కేవలం 6 రూపాయలు పొదుపు చేస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ టైంలో మీరు రూ. 3 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. అలాగే రూ. 18 చెల్లిస్తే మరో 3 లక్షల రూపాయలు పొందవచ్చు. ఈ డబ్బు మీ పిల్లల భవిష్యత్తులో విద్య, వివాహం, ఇంటి నిర్మాణం లేదా సొంత వ్యాపారానికి ఉపయోగపడుతుంది. కాగా, పోస్టాఫీసులో ప్రాజెక్టులు చాలా సురక్షితమన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోస్టాఫీసులో వృద్ధులు, చిన్నారులు, మహిళల కోసం ఎన్నో పథకాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త పథకం తీసుకువచ్చారు.

దరఖాస్తుకు అర్హతలు..

* తల్లిదండ్రుల వయస్సు 45 ఏళ్లు మించకూడదు.

* పిల్లల వయస్సు కనీసం 5 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి

* ఈ పథకం కుటుంబంలో ఉన్నంత మంది పిల్లలకు వర్తించదు.

* కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.

Similar News