ప్రజ్వల్ తీరుపై మాజీ ప్రధాని దేవెగౌడ సీరియస్

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మాజీ ప్రధాని దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-05-23 11:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మాజీ ప్రధాని దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పోలీసులకు లొంగిపోవాలని హెచ్చరికలు చేశారు. విదేశాల నుంచి వచ్చి తక్షణమే విచారణ ఎదుర్కోవాలని సూచించారు. కాగా, ఇదే విషయమై ఇప్పటికే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం ప్రజ్వల్‌ను రిక్వెస్ట్ చేశారు. మరోవైపు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ రద్దుకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రజల్వ్ రేవణ్ణ పాస్‌పోర్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. పాస్‌పోర్టు రద్దుతో పాటు ప్రజల్వ్‌ రేవణ్ణను భారత్‌కు తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిద్ధరామయ్య తన లేఖలో కోరారు.

Tags:    

Similar News