సినిమాను తలపించేలా పల్టీలు కొట్టిన కారు (వీడియో)

దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)పై ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది.

Update: 2024-01-22 06:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)పై ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది. హైస్పీడ్‌తో వెళ్తున్న ఓ కారు పల్టీలు కొడుతూ వంతెన రెలింగ్‌ను ఢీ కొట్టింది. సినిమాలో సన్నివేశాన్ని తలపించేలా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ వెనుక వస్తున్న మరో కారు డ్యాష్ క్యామ్‌లో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 21.8 కి.మీ పొడవు కలిగిన ఈ వంతెనను ఈనెల 12న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.అరేబియా సముద్రంపై ఈ వంతెన 16.5 కి.మీ మేర ఉంటుంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News