ఢిల్లీ హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం

దేశరాజధాని ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ (MHA) కార్యాలయం రెండో అంతస్థులో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.

Update: 2024-04-16 09:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశరాజధాని ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ (MHA) కార్యాలయం రెండో అంతస్థులో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో జిరాక్స్‌ మిషన్‌, కొన్ని కంప్యూటర్లు, కొన్ని పత్రాలు అగ్నికి ఆహుతైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఉదయం ఎంహెచ్‌ఏ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే మా సిబ్బంది ఏడు ఫైర్ టెండర్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆపడానికి ప్రయత్నాలు చేశారు. మంటలు 9.35 గంటలకు పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చామని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో హోంమంత్రి అమిత్ షా భవనంలో లేరని, పలువురు సీనియర్ అధికారులు మాత్రమే అక్కడ ఉన్నారని వారు పేర్కొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News