పెట్రోల్, డిజిల్‌పై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన!
సామాన్యులకు పెట్రోల్ ధరలు భారంగా మారుతున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సామాన్యులకు పెట్రోల్ ధరలు భారంగా మారుతున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని బుధవారం ప్రకటించారు. ఈ అంశంలో రాష్ట్రాలు అంగీకారం తెలిపితే వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు.
ఢిల్లీలోని పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ సభ్యులతో బడ్జెట్ అనంతర చర్చా కార్యక్రమంలో మాట్లాడిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేంద్ర సుంకంతో సహా రాష్ట్రాల వ్యాట్ రూపంలో పెట్రోల్, జీడిల్ ధరలపై ప్రస్తుతం రిటైల్ విక్రయ ధరలో 50 శాతం పన్నులే ఉంటున్నాయి. దీంతో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్లు సామాన్య ప్రజల నుంచి చాలా కాలంగా వినిపిస్తోంది.
నిర్మలమ్మ వ్యాఖ్యల వెనుక పొలిటికల్ యాంగిల్:
ఇంధనం జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే గరిష్ట పన్ను 28 శాతంతో సహా ఫిక్స్డ్ సర్ ఛార్జీ ఉండే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే జీఎస్టీలోకి పెట్రోల్, డీజిల్ వెళ్తే ఈ పన్ను మొత్తం కేంద్ర ఖాతాలోకి వెళ్తాయి. వాటిని రాష్ట్రాలు, కేంద్రం మధ్య 50-50 నిష్పత్తిలో ఆదాయాలు పంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంధన ధరలు భారీగా పెరిగాయని మోడీ ప్రభుత్వంపై అపవాదు ఉంది.
ఈ క్రమంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో ఆర్థిక మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడుతుందనే కారణంతో పలు రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలు పొలిటికల్‌గా సంచలనంగా మారబోతున్నాయి. నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ లోని ప్రభుత్వాలను సైతం ఈ అంశంలో ఇరుకున పెట్టే ఛాన్స్ గా ఈ అంశాన్ని కేంద్రం వాడుకోబోతోందా అనే చర్చ జరుగుతోంది. ఈ అంశంలో రాజకీయాలు ఎలా ఉన్నా జీస్టీ పరిధిలోకి ఇంధనాన్ని తీసుకువస్తే సామాన్యులకు బిగ్ రిలీఫ్ దక్కుతుందనే చర్చ జరుగుతోంది.
Also Read:
BBC ఇష్యూ: ఐటీ సర్వే( IT Survey) అంటే ఏంటో తెలుసా? IT సర్వే, IT సోదాలు, IT రైడ్స్కు మధ్య తేడా ఏంటీ?