మధ్యంతర బెయిల్‌ను పొడిగించండి.. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2024-05-27 05:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని.. దీనికి గాను సిటీ స్కాన్‌తో సహా అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. జైలులో ఉన్న కాలంలోనూ ఏడు కిలోల బరువు తగ్గానని పేర్కొన్నారు. ఈ పరీక్షలు తనకు ఎంతో కీలకమని వైద్యులు సైతం సూచించారని తెలిపారు. మ్యాక్స్ హాస్పిటల్ వైద్య బృందం సైతం ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు నిర్వహించిందని, కాబట్టి మిగతా వైద్య చికిత్సలను పూర్తి చేసేందుకు బెయిల్ పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. అనంతరం ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించగా తీహార్ జైలుకు తరలించారు. దీంతో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌కు దరఖాస్తు చేసుకోగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా అత్యున్నత న్యాయస్థానం ఆయనకు మే 10న 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీని ప్రకారం..కేజ్రీవాల్ జూన్ 2వ తేదీన లొంగిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గడువును పొడిగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందించనుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News