ఆప్ నేత అరెస్టు, వెంటనే బెయిల్.. బీజేపీ భయపడిందన్న కేజ్రీవాల్

గుజరాత్‌లో ఆప్ రాష్ట్ర మాజీ చీఫ్ గోపాల్ ఇటాలియాకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

Update: 2023-04-17 15:15 GMT

గాంధీనగర్: గుజరాత్‌లో ఆప్ రాష్ట్ర మాజీ చీఫ్ గోపాల్ ఇటాలియాకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీపై వివాదాస్పద వ్యాఖ్యలకు గాను సోమవారం ఆయనను అరెస్ట్ చేశారు. అయితే ఆ వెంటనే బెయిల్ మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు. గోపాల్ ఆఫ్ చీఫ్ కేజ్రీవాల్‌కు నమ్మకస్తుడిగా పేరొందారు. గతేడాది నవంబర్ లో ఎన్నికల ప్రచారంలో సంఘ్వీని ఉద్దేశించి డ్రగ్స్ సంఘ్వీ అని విమర్శించారు. గౌరవనీయ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ ప్రదర్శనను చూసి బీజేపీ షాక్ గురై ఇటాలియాను అరెస్ట్ చేసిందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతం అవడం చూసి బీజేపీ భయపడుతుందని ఇటాలియా విమర్శించారు.

Tags:    

Similar News