ఉద్యోగుల కష్టాలు.. చెప్పుల షాప్ కు వచ్చినా ల్యాప్ టాప్ లో మీటింగ్ కు అటెండ్ కాక తప్పలేదు

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దొరకడం గగనం అనుకుంటే దొరికిన ఉద్యోగాన్ని కాపాడుకోవడం మరో బిగ్ టాస్క్ గా మారింది.

Update: 2024-05-22 13:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దొరకడం గగనం అనుకుంటే దొరికిన ఉద్యోగాన్ని కాపాడుకోవడం మరో బిగ్ టాస్క్ గా మారింది. మీటింగ్ లు, వీడియో కాన్ఫరెన్స్ లు జూమ్ కాల్స్,, ఇలా చెప్పుకుంటే పోతే వీటిలో దేనికి హాజరు కాకపోయినా రిమార్క్ తప్పదు. అందుకోసమే కొంత మంది బైక్ పైనే జర్నీ చేస్తూ ల్యాప్ టాప్ పెట్టుకుని మీటింగ్ లకు అటెండ్ అవుతుంటే వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఫోటోనే మరొకటి ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఫుట్ వేరు స్టోర్ కు వచ్చిన ఓ మహిళ షాపింగ్ చేస్తూనే ల్యాప్ టాప్ లో టీమ్ మీటింగ్ కు హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన ఫోటోను కార్తీక్ భాస్కర్ అనే ఎక్స్ యూజర్ షేర్ చేస్తూ షూ షాపింగ్ చేస్తూనే ల్యాప్ టాప్ లో టీమ్ మీటింగ్ అటెండ్ అవుతోంది అని ఆ మహిళ ఫోటోను జత చేస్తూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై దీనిపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నాయి. కొందరు ఫన్నీగా రియాక్ట్ అవుతుంటే దీన్ని మరికొందరు విచారకమైనదిగా పేర్కొన్నారు. ఒక యూజర్ స్పందిస్తూ ఇది మల్టీటాస్కింగ్ ఇందులో తప్పేమి లేదు. నేను ఫిజికల్ గా ఆఫీస్ లో ఉన్నప్పుడు అమెజాన్ లేదా ఫ్లిప్ కార్డ్ లో విండో/యాప్ లో షూ షాపింగ్ చేస్తాను అని పేర్కొనగా మరో నెటిజన్ స్పందిస్తూ ఇలాంటి వ్యక్తుల వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీలను కంపెనీలను రద్దు చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విచారకరమైన స్థితి అని ఇది భారతదేశంలోని ప్రజలకు పని నీతి లేదనే అభిప్రాయాన్ని సృష్టిస్తుంది అని రాసుకొచ్చారు. మరో నెటిజన్ స్పందిస్తూ ఇలాంటి పనికిరాని సమావేశం ఏర్పాటు చేసిన నిర్వాహకుడిపై ఏ షూ వేయాలో ఆ మహిళ ఆలోచిస్తోందని కామెంట్ చేశారు. మొత్తంగా వర్క్ ఫ్రమ్ షూ స్టోర్ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

Click Here For Twitter Post..

Tags:    

Similar News