లోక్ సభ ఎన్నికల ఐదు విడతల పోలింగ్ పర్సంటేజ్‌పై ఈసీ కీలక ప్రకటన

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటి వరకు విజయవంతంగా

Update: 2024-05-25 13:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటి వరకు విజయవంతంగా ఐదు దశలు కంప్లీట్ అయ్యాయి. ఇవాళ (శనివారం) సిక్త్స్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆరో విడతలో భాగంగా దేశంలోని 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు కంప్లీట్ అయిన ఐదు దశల ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది.

మొదటి విడతలో 66.41 శాతం, రెండో విడతలో 66.71 శాతం, మూడో విడతలో 65.68 శాతం, నాలుగో విడతలో 69.16 శాతం, ఐదో విడతలో 62. 20 శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదు అయినట్లు అధికారికంగా ఇవాళ ఈసీ వెల్లడించింది. ఇప్పటి వరకు పూర్తి అయిన ఐదు దశల్లో రెండు తెలుగు రాష్ట్రాల లోక్ సభ ఎన్నికలు జరిగిన ఫోర్త్ ఫేజ్‌లో అత్యధిక శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదు కాగా.. ఐదో విడతలో అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదు అయినట్లు పేర్కొంది. ఇక, ఇవాళ (శనివారం) ఆరో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. 

Similar News