అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్, నికోబార్ దీవుల దీవుల క్యాంప్‌బెల్ బేలో గురువారం ఉదయం 8:51 గంటల భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

Update: 2023-04-13 05:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: అండమాన్, నికోబార్ దీవుల దీవుల క్యాంప్‌బెల్ బేలో గురువారం ఉదయం 8:51 గంటల భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అలాగే ఇది 60 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు తెలిపారు. కాగా ఆదివారం మూడు గంటల వ్యవధిలో అండమాన్, నికోబార్ దీవులలో 4.9, 4.1 మరియు 5.3 తీవ్రతతో మూడు భూకంపాలు సంభవించాయి. వరుస భూకంపాలు సంబవిస్తుండటంతో పర్యాటకంగా అక్కడికి వెళ్లే, వెళ్లాలనుకునేవారు.. కాస్త భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే సముద్ర ప్రాంతం కావడం వలన భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటే సునామీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.

Tags:    

Similar News