Earthquake: గుజరాత్‌లో కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతగా నమోదు

దేశంలో వరుస భూకంపలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Update: 2024-05-08 13:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో వరుస భూకంపలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌లో ఇవాళ మధ్యాహ్నం భూమి స్వల్పంగా కంపించింది బుధవారం మధ్యాహ్నం 3.18 గంటలకు సౌరాష్ట్రలోని తలాలా ప్రాంతంలో ఉత్తర ఈశాన్య దిశగా 12 కి.మీ దూరంలో రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది.

ఇటీవలే హిమాచల్‌లో..

హిమాచల్‌ప్రదేశ్‌‌లోని చంబా జిల్లాలో గత నెల 4న రాత్రి 9:35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. అకస్మాత్తుగా భూకంపం రావడంతో ప్రజలను ఇళ్ల నుంచి బయటికి పరిగెత్తి సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపం కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News