DRDO స్మార్ట్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్

ఇటీవల కాలంలో భారత్ అన్నిరంగాల్లో వేగవంతమైన అభివృద్దితో దూసుకుపొతుంది.

Update: 2024-05-01 11:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో భారత్ అన్నిరంగాల్లో వేగవంతమైన అభివృద్దితో దూసుకుపొతుంది. ఈ క్రమంలోనే అధునాతన టెక్నాలజీని భారత రక్షణ వ్యవస్థ పూర్తిగా ఉపయోగించుకుంటుంది. ఈ క్రమంలోనే డీఆర్డీవో ఇటీవల సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్ఫిడో(SMART)ను తయారు చేసింది. దీనిని ఈ రోజు ఒడిశాలోని కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించగా.. విజయవంతంగా టార్గెట్ ను రీచ్ అయింది. కాగా ఈ స్మార్ట్ మిస్సైల్‌ను డీఆర్డీవో ఇండియన్ నేవీ సంయుక్తంగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిచారు. స్మార్ట్ మిస్సైల్ శత్రువుల జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకుని.. దాడి చేయడంలో సాధారణ టార్ఫిడోల కంటే ఎక్కువ వేగం, పరిధిని కలిగి ఉంటుందని దీనిని తయారు చేసిన వారు తెలిపారు.

Similar News