దూరదర్శన్ కీలక నిర్ణయం.. 50 బాషల్లో వార్తలు చదవనున్న కొత్త యాంకర్లు!

డిడి కిసాన్ ప్రారంభించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో దూరదర్శన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-05-24 14:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: డిడి కిసాన్ ప్రారంభించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో దూరదర్శన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. డిడి కిసాన్ చానెల్ లో వార్తలు చదివేందుకు ఇద్దరు కొత్త యాంకర్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. వీరు మొత్తం 50 బాషల్లో వ్యవసాయ వార్తలు చదవనున్నారు. అలా ఎలా అనుకుంటున్నారా? ఈ యాంకర్లు పూర్తిగా కృత్రిమ మేధ సహాయంతో వార్తలు చదవనున్నారు. చానెల్ మొదలు పెట్టి మే 26 నాటికి 9 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట ఇద్దరు యాంకర్లను తీసుకురానున్నట్లు దూరదర్శన్ వెల్లడించింది.

ఈ యాంకర్లు పూర్తిగా ఏఐ కనెక్డెడ్ కంప్యూటర్లని.. అచ్చం మనుషుల్లాగే వార్తలు చదవగలవని తెలిపింది. దీంతో దేశంలోనే ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టిన తొలి ప్రభుత్వ చానెల్ గా డిడి కిసాన్ రికార్డు నెలకొల్పనుంది. ఇవి అలసిపోకుండా 24 గంటల పాటు 365 రోజులు పని చేయగలవని, వ్యవసాయ రంగంలో పరిశోధనలు, మార్కెట్ లో ధరలు, వ్యవసాయ విభాగానికి చెందిన ప్రభుత్వ పధకాలు వాతవరణ సమాచారం గురించి నిరంతరం రైతులకు సమాచారాన్ని అందిస్తాయని వ్యవసాయ, రైతు, సంక్షేమ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా తెలియజేశింది.


Similar News