కోటాలో మరో విద్యార్థి అదృశ్యం

'తన వద్ద రూ. 8,000 ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేస్తాను. ఐదేళ్ల వరకు ఇంటికి తిరిగిరాను..'

Update: 2024-05-09 08:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 'తన వద్ద రూ. 8,000 ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేస్తాను. ఐదేళ్ల వరకు ఇంటికి తిరిగిరాను..' అంటూ కుటుంబానికి మేసేజ్ చేసి ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత కొంతకాలంగా విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో చర్చనీయాంసమైన రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఘటన జరిగింది. పోటీ పరీక్షల ఒత్తిడిని భరించలేక తాజాగా మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. పారిపోవడానికి ముందు కుటుంబానికి ఆ విద్యార్థి పంపిన మెసేజ్ చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజేంద్ర మీ అనే విద్యార్థి రాజస్థాన్‌లోని బమన్‌వాస్ ప్రాంతానికి చెందినవాడు. మే 6వ తేదీ నుంచి అతను కనిపించడంలేదు. దానికి ముందు ఇంటి సభ్యులకు డబ్బులున్నాయని, ఐదేళ్ల వరకు ఇంటికి రానని, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోనని చెప్పి మెసేజ్ చేశాడు. తన వద్ద అందరి ఫోన్ నంబర్లు ఉన్నాయని, తన గురించి ఆందోళన పడొద్దని మెసేజ్‌లో పేర్కొన్నాడు. కాగా, కోటా వివిధ పోటీ పరీక్షల కోసం కోచి సెంటర్లకు ప్రసిద్ధి. అయితే కొన్నాళ్ల నుంచి ఇక్కడ విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో దీనిపై కేంద్రం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే విధంగా శిక్షణ ఉండాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆత్మహత్యలు, విద్యార్థులు పారిపోయే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 

Tags:    

Similar News