లిఫ్ట్‌లో బాలికపై ఒక్కసారిగా కుక్క దాడి (వీడియో)
లిఫ్ట్‌లో ఓ బాలికపై కుక్క దాడికి పాల్పడింది.
దిశ, వెబ్‌డెస్క్: లిఫ్ట్‌లో ఓ బాలికపై కుక్క దాడికి పాల్పడింది. ఈ ఘటన ఢిల్లీలో నోయిడాలో చోటు చేసుకుంది. ఈ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియో సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయింది. లిఫ్ట్ ఎక్కిన బాలిక దిగేందుకు సిద్ధం కాగా డోర్ ఓపెన్ కాగానే కుక్క ఒక్కసారిగా దాడికి పాల్పడింది. దీంతో ఆమె భుజంపై గాయమైంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో బాలిక ఒక్కరే లిఫ్ట్‌లో ఉన్నారు. కుక్క వెనకే వచ్చిన దాని ఓనర్ వెంటనే తేరుకుని కుక్కను తరమడంతో ప్రమాదం భారీ ప్రమాదం తప్పింది. సెక్టార్ 107, లోటస్- 300 సొసైటీలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.