డీసీడబ్లూలోని 223 మంది ఉద్యోగుల తొలగింపు: ఢిల్లీ ఎల్జీ సక్సేనా ఉత్తర్వులు

ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాల మేరకు ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్లూ)లోని 223 మంది ఉద్యోగులను తొలగించారు. వీరందరినీ నిబంధలకు విరుద్ధంగా అప్పటి డీసీడబ్లూ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ నియమించారని ఆరోపించారు.

Update: 2024-05-02 05:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాల మేరకు ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్లూ)లోని 223 మంది ఉద్యోగులను తొలగించారు. వీరందరినీ నిబంధలకు విరుద్ధంగా అప్పటి డీసీడబ్లూ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ నియమించారని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఉడ్యోగులను నియమించారని తెలిపారు. డీసీడబ్లూ చట్టం ప్రకారం..కమిషన్‌లో 40 మంది ఉద్యోగులను మాత్రమే నియమించుకోవాలని, గవర్నర్ ఆమోదం లేకుండానే 223 పోస్టులను సృష్టించారని ఎల్జీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్‌పై ఉద్యోగులను నియమించుకునే అధికారం కమిషన్‌కు లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సుధీర్ఘ విచారణ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఆరోపణలపై స్వాతి మలివాల్ ఇంకా స్పందించలేదు. దీంతో ఆప్, ఎల్జీ మధ్య ఉన్న విబేధాలు మరోసారి బయటపడినట్టైంది. కాగా, స్వాతి మలివాల్ ఆప్ తరపున రాజ్యసభకు నామినేట్ కావడంతో ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ మహిళా కమిషన్ పదవికి రిజైన్ చేశారు. 

Tags:    

Similar News