independence day: రాజధానిలో ఉగ్రకుట్ర..2వేలకు పైగా బుల్లెట్లు స్వాధీనం

Delhi Police Recovers Over 2000 live cartridges ahead of independence day Celebrations| స్వాతంత్ర వేడుకలకు సిద్ధం అవుతున్న వేళ దేశ రాజధానిలో పోలీసులు భారీగా బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారి వద్ద నుంచి 2,251 బుల్లెట్లు

Update: 2022-08-12 10:08 GMT

న్యూఢిల్లీ : Delhi Police Recovers Over 2000 live cartridges ahead of independence day Celebrations| స్వాతంత్ర వేడుకలకు సిద్ధం అవుతున్న వేళ దేశ రాజధానిలో పోలీసులు భారీగా బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారి వద్ద నుంచి 2,251 బుల్లెట్లు స్వాధీనం చేస్తుకున్నట్లు తెలిపారు. అనంద్ విహార్ ప్రాంతంలో రెండు బ్యాగుల బుల్లెట్లతో ఉండగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో ఉగ్ర కుట్ర లేదనే విషయాన్ని కొట్టిపారేయలేమని తెలిపారు. అరెస్టైన ఆరుగురిలో ఒకరు డెహ్రడూన్ చెందిన వారిగా గుర్తించారు. అతనే గన్ హౌజ్ ఓనర్‌గా భావిస్తున్నారు. ప్రాథమికంగా క్రిమినల్ నెట్‌వర్క్ కలిగి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉగ్రముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు నిరంతరం వాహాన చెకింగ్, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం 10,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని దేశ రాజధానిలోని ఎర్ర కోట పరిసరాల్లో మోహరించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర.. భార్య జంప్

Tags:    

Similar News