Delhi Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలకంగా మారిన కేజ్రీవాల్ మొబైల్.. ట్విస్ట్ ఇచ్చిన యాపిల్ సంస్థ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

Update: 2024-04-03 11:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఆదేశాలివ్వడంతో ఢిల్లీ పోలీసులు ఆయనను తీహార్ జైలుకు తరలించారు. విచారణలో భాగంగా కేజ్రీవాల్ అధికారులకు సహకరించడం లేదని తెలుస్తోంది. కేసులో కీలకంగా మారిన ఆయన ఐఫోన్‌పై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఫోన్ లాక్ ఓపెన్ చేయాలని చెప్పగా.. అందుకు కేజ్రీవాల్ పాస్‌వర్డ్ మర్చిపోయాయని సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో చేసేదేమి లేక ఆయన ఫోన్‌ను యాక్సెస్ చేయడంలో సాయం కోసం ఐఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థ ప్రతినిధులను ఈడీ సంప్రదించినట్లుగా తెలుస్తోంది. కానీ, కేజ్రీవాల్ ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు నిరాకరించింది. ఎవరైతే యూజర్ సెట్ చేసిన పాస్‌వర్డ్‌తో మాత్రమే డేటాను యాక్సెస్ చేయవచ్చని యాపిల్ ప్రతినిధులు సమాధానమిచ్చారు.

Tags:    

Similar News