వరుసగా ఐదోసారి ED నోటీసులు.. స్పందించిన సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరు కాకపోవడంతో ఐదోసారి నోటీసులు జారీ చేశారు. తాజాగా.. ఇవాళ ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ స్పందించారు. విచారణకు హాజరు కావట్లేదని చెప్పారు. అయితే.. ఈడీ అధికారులు గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు. తనను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగానే నోటీసులు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం.. మరోసారి ఆయన హాజరుకావడం లేదని స్పందించడంపై ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.