నియంతృత్వ పాలనలో దేశం: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్

లోక్‌సభ ఎన్నికల తర్వాత పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెదిరించారని, దేశం నియంతృత్వ పాలనలో ఉందనడానికి ఇదే నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

Update: 2024-05-27 10:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల తర్వాత పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెదిరించారని, దేశం నియంతృత్వ పాలనలో ఉందనడానికి ఇదే నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పంజాబ్‌లోని అమృత్ సర్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సీబీఐతో ఎమ్మెల్యేలను బెదిరిస్తామని బీజేపీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారని విమర్శించారు. 92 సీట్లున్న ఆప్ ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ఓట్లు అడగటానికి పంజాబ్‌కు వస్తున్నారా? లేక ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించడానికి వస్తున్నారా అని నిలదీశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలపై ప్రధాని మోడీ ఎన్నడూ నోరు మెదపలేదని ఆరోపించారు. గేదెలు, మంగళసూత్రాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని, ప్రజా సమస్యలపైనా స్పందించాలని సూచించారు. దేశంలో ఉన్న ఏ సమస్యకూ ఆయన వద్ద పరిష్కారం లేదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండేందుకే తనను అరెస్టు చేశారన్నారు.

Tags:    

Similar News