రికార్డు.. 100 గంటల్లో 100 కిలోమీటర్లు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం

ఘజియాబాద్-అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మణం రికార్డు సృష్టించింది. కేవలం 100 గంటల వ్యవధిలో 100 కిలోమీటర్ల దూరం బిటుమినస్ కాంక్రీట్‌ను వేసి చరిత్ర సృష్టించింది.

Update: 2023-05-20 03:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఘజియాబాద్-అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మణం రికార్డు సృష్టించింది. కేవలం 100 గంటల వ్యవధిలో 100 కిలోమీటర్ల దూరం బిటుమినస్ కాంక్రీట్‌ను వేసి చరిత్ర సృష్టించింది. ఈ వేగవంతమైన నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ షేర్ చేశారు. అలాగే దీనికి ఆయన.. ఘజియాబాద్-అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వే అపూర్వమైన 100 గంటల వ్యవధిలో 100 లేన్ కిలోమీటర్ల దూరం బిటుమినస్ కాంక్రీట్‌ను వేసి చరిత్ర సృష్టించింది. "ఈ సాధన భారతదేశం రహదారి మౌలిక సదుపాయాల పరిశ్రమ యొక్క అంకితభావం, చాతుర్యాన్ని హైలైట్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే.. "చాలా ముఖ్యమైన హైవే మార్గంలో చెప్పుకోదగ్గ విజయం" అని ప్రధాని నరేంద్ర మోడీ రాశారు.

Tags:    

Similar News