దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు వేయడంపై దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.

Update: 2023-03-25 15:03 GMT

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు వేయడంపై దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. శనివారం పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ఆయన నియోజకవర్గం వయనాడ్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు ‘బ్లాక్ డే’గా పాటించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్లపై అడ్డంగా ఉంచిన బారికేడ్లపై ఎక్కి హంగామా చేశారు. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశరాజధానిలోనూ కార్యకర్తలు రాహుల్ మాస్కులు ధరించి ప్లకార్డులు ప్రదర్శించారు.

నిజం కోసం రాహుల్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. చంఢీగఢ్‌లో కాంగ్రెస్ యువత రైళ్లను అడ్డుకున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం చనిపోయిందంటూ నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్ భోపాల్‌లో మహిళలు మూతికి నల్ల గుడ్డ, తాళం పెట్టుకుని మాట్లాడకుండా చేశారని నిరసన వ్యక్తం చేశారు. జార్ఖండ్‌తో పాటు పలురాష్ట్రాల్లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మహారాష్ట్రలో మహా వికాస్ అగాధీ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీపై వేటును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ పాపులారిటీ పెరగడంతో బీజేపీ భయపడుతుందని ఆరోపించారు.

Tags:    

Similar News