హర్యానాలో మెజారిటీని కోల్పోయిన బీజేపీ.. గవర్నర్‌ను కలవనున్న కాంగ్రెస్

ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవడంతో బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

Update: 2024-05-10 12:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడంతో హర్యానా గవర్నర్‌ను కలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కారణంగా బీజేపీ మైనారిటీలో ఉందని, రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ కోరనుంది. ఇటీవల ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవడంతో హర్యానా బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. కాబట్టి రాష్ట్రపతి పాలన అవసరం. లేదంట్ బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని, గడిచిన పదేళ్లలో పలు రాష్ట్రాల్లో బీజేపీ ఇదే చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. హర్యానాలో బీజేపీకి కాలం చెల్లిందనే విషయం ఈ పరిణామాలతో స్పష్టమవుతోందని పేర్కొన్నారు. కాగా, హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 39 మంది బలం ఉంది. కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జన్ నాయక్ జనతాపార్టీకి 10 మంది, హర్యానా లోక్‌హిత్ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్‌దల్ పార్టీలకు చెందిన ఒక్కరు చొప్పున, ఇండిపెండెంట్లు ఏడుగురు ఉన్నారు. ఉన్న ఏడుగురు ఇండిపెండెంట్ల మద్దతు ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల ప్రారంభంలో ముగ్గురు ఇండిపెండెంట్లు ప్రభుత్వం మద్దతును వెనక్కి తీసుకోవడంతో బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలోకి జారుకుంది. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News