ఢిల్లీలో కలకలం..ఒకేసారి ఆరు స్కూళ్లకు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున సుమారు ఆరు స్కూళ్లలో బాంబులు అమర్చినట్టు తమకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.

Update: 2024-05-01 04:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున సుమారు ఆరు స్కూళ్లలో బాంబులు అమర్చినట్టు తమకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. దీంతో స్థానిక పోలీసులు, బాంబు స్వ్కాడ్ బృందాలు ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టినట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ అంకిత్ సింగ్ వెల్లడించారు. బాంబు బెదిరింపు వచ్చిన స్కూళ్లలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్(ద్వారక), మదర్ మేరీ స్కూల్(మయూర్ విహార్), సంస్కృతి స్కూల్(చాణక్య పురి)లు ఉన్నాయి. అలాగే గ్రేటర్ నోయిడాలోని మరో మూడు పాఠశాలలకు సైతం హెచ్చరికలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆ స్కూళ్లను బంద్ చేయించి విద్యార్థులను ఇంటికి పంపించారు. పాఠశాల ప్రాంగణాలకు దూరంగా ఉండాలని స్థానికులను ఆదేశించారు. బాంబ్ స్వ్కాడ్ బృందాలు తనిఖీలు చేపడుతున్నట్టు తెలిపారు. అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తల్లి దండ్రులు ఆందోళన చెందొద్దని సూచించారు. పాఠశాలల చుట్టు పక్కల ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులను పోలీసులు కనుగొనలేదు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, గతంలోనూ ఢిల్లీలోని అనేక స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News