హిజాబ్‌ నిషేదంపై సీఎం సిద్దరామయ్య కీలక ప్రకటన

కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం హిజాబ్‌పై నిషేదం ఎత్తివేసినట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో హిజాబ్ నిషేదం ఎత్తివేతపై సీఎం

Update: 2023-12-23 11:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం హిజాబ్‌పై నిషేదం ఎత్తివేసినట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో హిజాబ్ నిషేదం ఎత్తివేతపై సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. కర్నాటకలో హిజాబ్‌పై నిషేదం ఎత్తివేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో హిజాబ్‌పై నిషేదాన్ని ఎత్తివేయాలనే యోచనలో ఉన్నామని స్ఫష్టం చేశారు. దీనిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, హిజాబ్ వ్యవహారం కర్నాటకలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి బీజేపీ ప్రభుత్వం కర్నాటకలో హిజాబ్‌పై నిషేదం విధించింది. తాజాగా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ సర్కార్ హిజాబ్‌పై నిషేదం ఎత్తివేయాలని ప్లాన్ చేస్తోంది. 


Similar News