పాక్‌లో క్రైస్తవులపై దాడి.. ఐదుగురికి గాయాలు

పాకిస్తాన్‌లోని సర్గోదా జిల్లాలో ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత ఏర్పడింది. క్రైస్తవులు లక్ష్యంగా ముస్లిం వర్గానికి చెందిన పలువురు దాడికి తెగబడ్డారు.

Update: 2024-05-25 13:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌లోని సర్గోదా జిల్లాలో ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత ఏర్పడింది. క్రైస్తవులు లక్ష్యంగా ముస్లిం వర్గానికి చెందిన పలువురు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. తమ మత గ్రంథాన్ని అపవిత్రం చేశారని ఆరోపిస్తూ క్రైస్తవ వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి, ఒక షూ ఫ్యాక్టరీకి కొందరు నిప్పంటించారు. ఈక్రమంలో రాళ్లు, ఇటుకలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనపై పాక్ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. క్రైస్తవ వర్గానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.

Similar News