పోలీస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో చీటింగ్.. 8 మందిపై కేసులు నమోదు

పోలీస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మోసం చేసేందుకు కొంతమంది అభ్యర్థులు ప్రయత్నించారు.

Update: 2023-03-07 06:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: పోలీస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మోసం చేసేందుకు కొంతమంది అభ్యర్థులు ప్రయత్నించారు. దీంతో వారిని పట్టుకుని పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంఘటన శుక్రవారం మరోల్‌లో నిర్వహించిన ముంబై పోలీస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌లో చోటు చేసుకుంది. ముంబై పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఎనిమిదిమంది స్లో రన్నర్‌లు మెరుగైన సమయాన్ని రికార్డ్ చేయడంలో సహాయపడేందుకు వారు తమలో తాము ఈ ట్యాగ్‌లను మార్పిడి చేసుకున్నారు. ఇది గమనించిన పోలీసులు వారిని రిక్రూట్‌మెంట్ నుంచి డిస్ క్వాలిఫై చేయడమే కాకుండా వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News