13 ప్రాంతీయ భాషల్లో సాయుధ పోలీసు బలగాల పరీక్షలు

సాయుధ పోలీసు బలగాల కానిస్టేబుల్ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది.

Update: 2023-04-15 09:24 GMT

న్యూఢిల్లీ: సాయుధ పోలీసు బలగాల కానిస్టేబుల్ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. వచ్చే ఏడాది నుంచి 13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఎఫ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. స్థానిక యువత ప్రమేయాన్ని పెంచే దిశగా కేంద్ర హోం మంత్రి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ప్రకటనలో వెల్లడించింది.

దీంతో హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాకుండా అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మళయాలం, కన్నడ, తమిళ్, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూరీ, కొంకణీ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. కొన్ని రోజుల క్రితమే ఇదే విషయమై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తమిళ భాషలో పరీక్ష నిర్వహించాలని కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం స్టాలిన్ స్వాగతించారు. తన లేఖను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిర్ణయం హర్షనీయమని అన్నారు. మిగతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోను రాష్ట్రీయ భాషలను ఉండేలా చూడాలని కోరారు. కాగా.. సీఆర్ పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఎన్ఎస్‌జీ ఇవన్నీ సీఏపీఎఫ్ కిందకే వస్తాయి.


Tags:    

Similar News