వేప చెట్టుకు గుత్తులుగా కాసిన మామిడి కాయలు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందినప్పటి నుంచి ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో ప్రపంచమంతా తెలిసిపోతుంది.

Update: 2024-05-26 12:41 GMT

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందినప్పటి నుంచి ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో ప్రపంచమంతా తెలిసిపోతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది స్మార్ట్ ఫోన్ వాడుతూ ప్రతి విషయాన్ని అందరికీ తెలిసేలా నెట్టింట షేర్ చేస్తున్నారు. అయితే కొన్ని నమ్మశక్యం కాని సంఘటనలు చోటుచేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

తాజాగా, ఇలాంటి కోవకు చెందిన ఓ ఘటనకు సంబంధించిన ఓ వీడియో అందరిని షాక‌కు గురిచేస్తోంది. వేప చెట్టుకు వేప కాయలు కాకుండా మామిడి కాయలు కాయడంతో చూపరులను ఆకట్టుకుంటుంది. అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధికారిక నివాసంలో వేప చెట్టుకు గుత్తులుగా మామిడి కాయలు కాశాయి. ఇక ఈ విషయాన్ని మంత్రి ప్రహ్లాద్ సింగ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నిమిషాల్లో వైరల్ అయింది.

ఇవాళ నేను నా ఇంటి ఆవరణలో వేప చెట్టును చూశాను. దానికి మామిడి కాయలు కనిపించడంతో చూసి నేను షాక్ అయ్యాను. ప్రతిభ గల ఓ తోటమాలి కొన్నేళ్ల కిందట ఈ ప్రయోగం చేసి ఉంటాడని అనిపించింది. ఇది ఒక అద్భుతం అని చెప్పేందుకు ఏ మాత్రం తీసిపోదు’’ అనే క్యాప్షన్ జత చేశాడు. అయితే మంత్రి ఈ విషయాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు చెప్పడంతో వారు వచ్చి వేప చెట్టును పరిశీలించి వేప చెట్టులో మామిడి కొమ్మ కూడా ఉందని నిర్దారించారు. అయితే కొన్నిసార్లు మామిడి పూత ఇతర చెట్లపై పడటం వల్ల మొక్కలుగా పెరుగుతుంటాయని తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Similar News