BREAKING : భారీ పేలుడు.. 17 మంది మృతి

ఛత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది.

Update: 2024-05-25 05:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బెమెతార జిల్లాలోని బొర్సి గ్రామంలోని బెర్లా బ్లాక్‌లో గన్ పౌడర్ తయారీ కేంద్రంలో శనివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. భారీ శబ్ధానికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెస్క్యూటీమ్స్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని రాయిపూర్‌లోని మెహ్‌కార ఆసుపత్రికి తరలించారు. బెమెతార కలెక్టర్, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పేరిగే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News