BREAKING: రాజ్‌కోట్ గేమింగ్ జోన్ కేసులో కీలక పరిణామం.. బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం

గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో శనివారం మధ్యాహ్నం టీఆర్పీ గేమింగ్ జోన్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-05-27 08:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో శనివారం మధ్యాహ్నం టీఆర్పీ గేమింగ్ జోన్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని సుమారు 28 మంది ప్రాణాలు విడిచారు. మృతుల్లో విద్యార్థులు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసుల ద్వారా సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాజ్‌కోట్‌లో అనుమతి లేకుండానే రెండు గేమింగ్ జోన్లను నిర్వహిస్తున్నట్లుగా విచారణలో వెల్లడైంది. అయితే, గేమింగ్ జోన్లకు తమ అనుమతి లేదని గుజరాత్ హైకోర్టుకు మున్సిపల్ అధికారులు విన్నవించారు. దీంతో సీరియస్ అయిన కోర్టు రెండున్నరేళ్లుగా అలా గేమింగ్ జోన్లు నిర్వహిస్తుంటే నిద్రపోతున్నారా.. అంటూ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మరణించిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు రాజ్‌కోట్ పరిధిలోని లాయర్లంతా కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసులో నిందితుల తరఫున ఎవరూ వాదించకూడదని బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది.    

Tags:    

Similar News