ఢిల్లీలో ఎన్నికల బరిలో ఉన్న ధనవంతులు వీళ్లే..!

లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో మనోజ్ తివారీయే అత్యంత ధనవంతుడు.

Update: 2024-05-07 04:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో మనోజ్ తివారీయే అత్యంత ధనవంతుడు. ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఆయన ఆస్తుల విలువ రూ.28.05 కోట్లు. దక్షిణ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి రామ్ వీర్ సింగ్ బిధూరి రూ.21.08 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. పశ్చిమ ఢిల్లీ ఆప్ అభ్యర్థి మహాబల్ మిశ్రా రూ.19.93 కోట్ల ఆస్తులతో మూడో స్థఆనంలో ఉన్నారు. దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ రూ.19 కోట్లతో తరవాతి స్థానంలో ఉన్నారు. బీఎస్పీ నేత రాజ్ కుమార్ ఆనంద్ ఆస్తుల విలువ రూ.17.87 కోట్లు.

మనోజ్ తివారీపై పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ ఆస్తుల విలువ రూ.10.65 లక్షలు. పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న కమల్ జీత్ సెహ్రావత్ ఆస్తుల విలువ రూ.1.30 కోట్లుగా పేర్కొన్నారు. చాందినీ చౌక్ బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ ఖండేల్వాల్ ఆస్తుల విలువల రూ.6.62 కోట్లు కాగా.. నార్త్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజ్ ఆస్తుల విలువ రూ.కోటి.

దక్షిణ ఝిల్లీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న థర్డ్ జెండర్ అభ్యర్థి రాజన్ ఆస్తుల విలువల రూ.లక్ష. కాగా.. ఆయన వద్ద 200 గ్రాముల బంగారం, బ్యాంకు ఖాతాలో రూ.10వేలు సహా రూ.15.10 లక్షల చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు.

Similar News