ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్‌లు..పొటోలు షేర్ చేసిన టీఎంసీ: ఈసీ స్పందనిదే?

ఆరో దశ లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపించింది.

Update: 2024-05-25 09:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆరో దశ లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపించింది. ఈ మేరకు బంకురాలోని రఘునాథ్ పూర్‌లో ఓ ఐదు ఈవీలం బాక్సులకు బీజేపీ ట్యాగ్‌లు ఉన్న పోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈసీ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బీజేపీ టాంపరింగ్‌కు పాల్పడిందని తెలిపింది.

అయితే ఈ ఆరోపణలపై ఈసీ స్పందించింది. టీఎంసీ ఆరోపణలను కొట్టిపారేసింది. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే ముందు ఆయా పార్టీల అభ్యర్థులు, వారి తరఫున ఏజెంట్లు సంతకం చేశారని పేర్కొంది. కానీ ఆ టైంలో బీజేపీ అభ్యర్థికి సంబంధించిన ప్రతినిధి మాత్రమే ఉన్నారు కాబట్టి, ఆయన సంతకం తీసుకున్నామని స్పష్టం చేసింది. అయితే పోలింగ్ ప్రారంభమయ్యాక అక్కడ 56, 58, 60, 61, 62 పోలింగ్ స్టేషన్లలో అన్ని పార్టీల ఏజెంట్ల సంతకాలను సేకరించినట్టు తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి సీసీ కెమెరాల నిఘాలో జరుగుతుందని వెల్లడించింది. ఎన్నికల నిబంధనలన్నీ తప్పకుండా అమలవుతాయని పేర్కొంది. కాగా, ఆరో దశ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 

Tags:    

Similar News