దేశంలో బీజేపీ-ఎన్డీయే తుపాన్: ప్రధాని నరేంద్ర మోడీ

దేశంలో మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమినే అధికారంలోకి వస్తుందని, దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Update: 2024-05-26 07:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమినే అధికారంలోకి వస్తుందని, దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఇప్పటి వరకు జరిగిన ఆరు దశల ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపారని, దేశంలో బీజేపీ-ఎన్డీయే తుపాన్ వీస్తోందని తెలిపారు. ఇండియా కూటమి కులతత్వం, మతతత్వంతో కూరుకు పోయిందని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు ఉంటారని, అలాంటి వారు దేశాన్ని బలోపేతం చేయగలరా అని ప్రశ్నించారు.

సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్‌లు ఓటు బ్యాంకుకే పరిమితమయ్యారని ఆరోపించారు. కానీ మోడీ మాత్రం దేశంలోని పేదలు, దళితులు, వెనుకబడిన ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. బీజేపీ అనుసరించిన విధానాల కారణంగానే దేశంలో మూడో సారి కూడా బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుందన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు రాజకీయాలకు అర్థం చేసుకున్నారని, ఎవరివైపు మొగ్గు చూపాలో వారికి తెలుసని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని ఎస్పీ చెబుతోంది, దీని కన్నా దారుణమైన అభిప్రాయం మరొకటి ఉండదు అని విమర్శించారు. బాబా సాహెబ్‌ని వెన్నుపోటు పొడిచేందుకు అనుమతిస్తారా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News