ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రశాంత్ కిషోర్‌కు బీజేపీ నిధులు: తేజస్వీ యాదవ్

వ్యూహంలో భాగంగా మూడు-నాలుగు రౌండ్ల ఓటింగ తర్వాత అతన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు.

Update: 2024-05-24 11:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను 'బీజేపీ ఏజెంట్'గా అభివర్ణించిన ఆయన, ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతోంది కాబట్టే వ్యూహంలో భాగంగా మూడు-నాలుగు రౌండ్ల ఓటింగ తర్వాత అతన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు. జన్ సూరజ్ పేరుతో సొంత పార్టీ ఉన్న ప్రశాంత్ కిషోర్ అనేక పార్టీలకు ప్రచారం చేయడమే కాకుండా నితీష్ కుమార్ జనతాదళ్(యూ)లో కూడా ఆయన నంబర్ 2గా ఉన్నారు. అమిత్ షా కోరిక మేరకే ప్రశాంత్ కిషోర్‌ను జాతీయ ఉపాధ్యక్షుడిని చేశానని మా మామ(నితీష్ కుమార్) కూడా చెప్పారు. ఈ మాటలను ఇప్పటివరకు అమిత్ షా గానీ, ప్రశాంత్ కిషోర్ గానీ ఖండించలేదు. ఆయన బీజేపీలోనే ఉన్నారు. మొదటి నుంచి అతను ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ నాశనమవుతుందని తేజస్వీ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రశాంత్ కిషోర్‌కు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కానీ ప్రతి ఏటా వేర్వేరు వ్యక్తులతో పనిచేస్తూనే ఉంటారు. అతను ప్రజల డేటాను తీసుకొని మరొకరికి ఇస్తాడు. కేవలం బీజేపీ ఏజెంట్‌గానే కాకుండా బీజేపీ సిద్ధాంతాలనే అనుసరిస్తాడు. బీజేపీ వ్యూహంలో భాగంగానే ప్రశాంత్ కిషోర్‌కు నిధులు సమకూరుతున్నాయని తేజస్వీ యాదవ్ విమర్శించారు. 

Read More..

పుట్టబోయే బిడ్డ లింగం తెలుసుకునేందుకు భార్య గర్భాన్ని కోసిన భర్త.. కోర్టు సంచలన తీర్పు

Tags:    

Similar News