ఈవీఎంను ధ్వంసం చేసిన ఆరోపణలపై ఒడిశా బీజేపీ అభ్యర్థి అరెస్ట్

ఈవీఎం పనిచేయకపోవడంతో క్యూలో ఎదురుచూడాల్సి వచ్చింది. దాంతో అసహనానికి గురైన ప్రశాంత్ జగ్‌దేవ్ ఈవీఎంను ద్వంసం చేశారు.

Update: 2024-05-26 12:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఈవీఎంను ధ్వంసం చేసినందుకు ఓ బీజేపీ అభ్యర్థిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ప్రస్తుత చిలికా అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్‌దేవ్ ఖుర్దా అసెంబ్లీ స్థానానికి పోటీలో ఉన్నారు. శనివారం ఆరో దశలో పోలింగ్ సందర్భంగా ఓటు వేసేందుకు వెళ్లిన ఆయన ఈవీఎం మెషిన్ పనిచేయకపోవడంతో చాలాసేపు క్యూలో ఎదురుచూడాల్సి వచ్చింది. దాంతో అసహనానికి గురైన ప్రశాంత్ జగ్‌దేవ్ ఈవీఎంను ద్వంసం చేశారు. తనకు ఓటు హక్కు ఉన్న బెగునియా అసెంబ్లీ సెగ్మెంట్‌, బోలగాడ్ బ్లాక్ కౌన్రీపట్నలోని 114వ బూత్‌లో శానివారం ఈ ఘటన జరిగింది. తన భార్యతో కలిసి ఓటు వేసేందుకు బూత్‌కు వెళ్లిన ఎమ్మెల్యే ఈవీఎం పనిచేయని విషయంపై ప్రిసైడింగ్ అధికారితో మాటల యుద్ధం జరిగింది. ఆ నేపథ్యంలొనే టెబుల్‌పై ఉన్న ఈవీఎంను ప్రశాంత్ జగ్‌దేవ్ తొలగించి పక్కకు విసిరేసినట్టు అధికారులు తెలిపారు. ప్రిసైడింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యేను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపిందని, ప్రస్తుతం ఆయనను ఖుర్దా జైల్లో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్యే బూత్ వద్ద గందరగోళన్ సృష్టించారని, ఓటింగ్ ప్రక్రియను అడ్డుకున్నారని, పోలింగ్ సిబ్బందిపై దుర్భాషలాడారని ప్రిసైడింగ్ అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారిని అభ్యర్థించామని, విచారణ జరుగుతున్నట్టు ఆయన తెలిపారు.   

Tags:    

Similar News