మధ్యప్రదేశ్‌ బీఎస్పీ అభ్యర్థి గుండెపోటుతో మృతి

ఈ మేరకు మంగళవారం అధికారులు ధృవీకరించారు.

Update: 2024-04-09 17:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భలావి మరణించారు. ఈ మేరకు మంగళవారం అధికారులు ధృవీకరించారు. అశోక్ భలావి మృతికి సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు పంపించామని, ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ తెలిపారు. బీఎస్పీ నేతకు గుండెపోటు వచ్చిందని, ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికి చనిపోయాడని డాక్టర్ మనీష్ లష్కరే పేర్కొన్నారు. ఈ నెల 26న రెండో దశలో బేతుల్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.

Tags:    

Similar News