అసోంను వీడని వానలు.. వేల హెక్టార్ల పంట మునక

డిస్పూర్: అసోంలో వర్ష ప్రభావం ఇంకా తగ్గలేదు. రాష్ట్రంలోని 34 జిల్లాలకు గాను 29 జిల్లాల్లో తీవ్రంగా ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు..Latest Telugu News

Update: 2022-05-19 15:17 GMT

డిస్పూర్: అసోంలో వర్ష ప్రభావం ఇంకా తగ్గలేదు. రాష్ట్రంలోని 34 జిల్లాలకు గాను 29 జిల్లాల్లో తీవ్రంగా ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారని వెల్లడించారు. ఇప్పటివరకు 7,17,046 మంది వరద ప్రభావానికి గురయ్యారు. 9 మంది వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణించారు అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1413 గ్రామాలు నీటిలోనే ఉన్నాయని, ముఖ్యంగా నాగోన్ జిల్లాలో వరదల ప్రభావంతో 2.88 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైనట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. దీంతో ప్రజలను సహాయక బృందాలు సురక్షిత స్థలాలకు తరలించాయి. దాదాపు 9,742.57 హెక్టార్ల పంట నీట మునిగిందని సమాచారం. అంతేకాకుండా రవాణా వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని అధికారులు వెల్లడించారు.

Similar News