సుప్రీంకోర్టు జడ్జీల వల్లే మీ ముందున్నా.. నియంత నుంచి దేశాన్ని కాపాడుదాం : కేజ్రీవాల్

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన కేజ్రీవాల్ కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ వచ్చింది.

Update: 2024-05-10 16:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన కేజ్రీవాల్ కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ వచ్చింది. దీంతో జైలు అధికారులు ఆయన్ని విడుదల చేశారు. ఆప్ శ్రేణులు పెద్ద ఎత్తున జైలు దగ్గర గుమిగూడారు. కేజ్రీవాల్‌ ఇంటి దగ్గర స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. దాదాపు 50 రోజుల తర్వాత విడుదలైన కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ తివారీలతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అరవింద్ కేజ్రీవాల్‌కి స్వాగతం పలికారు.

హనుమాన్‌ వల్లే బయటకు వచ్చానని ఉద్వేగానికి గురయ్యారు కేజ్రీవాల్. శనివారం ఉదయం 11గంటలకు కన్నాట్ హనుమాన్‌ ఆలయాన్ని సందర్శిస్తాని తెలిపారు. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జడ్జిలకు ధన్యవాదాలు తెలిపారు. జడ్జిల వల్లే బయటకొచ్చానని పేర్కొన్నారు. తనను ఆశీర్వదించిన కోట్లాది మందికి రుణపడి ఉంటానని అన్నారు. నియంతృత్వం నుంచి మన దేశాన్ని రక్షించుకోవాలని అన్నారు. తన శక్తిమేరకు పోరాడతానని స్పష్టం చేశారు. అందుకోసం 140 కోట్ల మంది ప్రజల మద్దతు కావాలని కోరారు. శనివారం మధ్యాహ్నం 1గంటకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టు అయ్యారు. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది ఈడీ. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. కేజ్రీవాల్ తీహార్ జైలులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

లోక్ దశ ఎన్నికలకు చివరి దశ ఓటింగ్ జరిగే జూన్ 1 వరకు కేజ్రీవాల్ బెయిల్‌పై ఉంటారు. కేజ్రీవాల్ జూన్ 2 నాటికి లొంగిపోవాల్సి ఉంటుంది. కేజ్రీవాల్ బెయిల్‌ను పొడిగించాలన్న అభ్యర్థనలను కోర్టు తిరస్కరించింది. అయితే, దానికోసం వచ్చే వారం వాదనలు వింటామని తెలిపింది కోర్టు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News