భారత్‌లో మరో 4.0 తీవ్రతతో భూకంపం..

భారత్ దేశంలో మరో భూకంపం వలన ప్రకంపనలు వచ్చాయి. నిన్న ఢిల్లీలో భూకంపం సంభవించగా.. తాజాగా నేడు ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌‌లో సోమవారం ఉదయం భూ ప్రకంపణలు వచ్చాయి.

Update: 2023-10-16 05:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్ దేశంలో మరో భూకంపం వలన ప్రకంపనలు వచ్చాయి. నిన్న ఢిల్లీలో భూకంపం సంభవించగా.. తాజాగా నేడు ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌‌లో సోమవారం ఉదయం భూ ప్రకంపణలు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0 నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. కాగా ఈ భూకంప కేంద్రం పితోర్‌ఘర్‌కు ఈశాన్యంగా 48 కి.మీ దూరంలో ఉన్నట్లు NCS స్పష్టం చేసింది. ఇది పితోర్‌ఘర్‌కు 5 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దీని వలన ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెంది ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ భూకంపం కారణంగా ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.

Tags:    

Similar News